ఇళ్ల నిర్మాణం.. ఇక వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణం.. ఇక వేగవంతం

Mar 3 2025 6:39 AM | Updated on Mar 3 2025 6:46 AM

రామాయంపేట(మెదక్‌): ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. ఈమేరకు జిల్లాలోని మండల కేంద్రాల్లో రూ. ఐదు లక్షలతో ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌లు నిర్మించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు, వాటిని నిర్మించే మేసీ్త్రలకు అవగాహన కల్పించడానికి వీలుగా వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో మొదటి విడతలో పది మండలాల్లో మోడల్‌ హౌస్‌లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రామాయంపేట, మెదక్‌, టేక్మాల్‌, పాపన్నపేట, రేగోడ్‌లో ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గృహా నిర్మాణ శాఖ అధికారులు దగ్గరుండి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులు చూసి వెళ్తున్నారు. రూ. 5 లక్షలతో ఎలా ఇళ్లు నిర్మించాలన్న విషయమై అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై గృహా నిర్మాణశాఖ డీప్యూటీ ఈఈ యాదగిరి మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో మోడల్‌ హౌస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఐదు మండల కేంద్రాల్లో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. మిగితా మండలాల్లో సైతం త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

మండలానికో ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement