కాంగ్రెస్ అందోల్ అభ్యర్థి దామోదర
అల్లాదుర్గం(మెదక్): సాధారణ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రజలను కోరారు. మండలంలోని మాందాపూర్ గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిపెద్దాపూర్ గ్రామ బీఆర్‌ఎస్‌కి చెందిన మహమ్మద్ ఖాసీం, మహమ్మద్ జామల్ బాయ్, సాబీర్, యాదుల్, హజీం, బసీరుద్దీన్, గౌస్, దేవునూరి మూర్తుజ, మహబూబ్ హుస్సేన్ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి దామోదర రాజనర్సింహా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, సర్పంచ్ దుర్గారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబ్దుల్ సుకుర్, పార్టీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు అభిలాష్ రెడ్డి, రోషన్ అలీ, సుభాష్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.