
మాట్లాడుతున్న చంద్రపాల్
రైస్‌మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్
మెదక్‌జోన్: రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌కు చెందిన రూ. 10 కోట్లు వాడుకున్నానని.. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన రైస్‌మిల్లర్ శ్రీధర్‌గుప్తాపై రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేస్తానని జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 157 మంది రైస్‌మిల్లర్లు ఉండగా.. శ్రీధర్‌గుప్తాకు చెందిన బియ్యాన్ని కార్పొరేషన్‌కు పంపుతూ మిగితా మిల్లర్ల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ప ంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు అతడితో కుమ్మకై బియ్యం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈవివాదంపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తుంది. మఫ్టీలో రహస్యంగా ఫొటోలు తీశారు. ప్రెస్‌మీట్ ఉన్న విషయం తెలిసే వచ్చామని వారు పేర్కొన్నారు. సమావేశంలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఏరియా రైస్ మిల్లర్స్ అసోయేషన్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, వెంకటేశం, జిల్లా కోశాధికారి గౌ రి శంకర్, నాయకులు పాల్గొన్నారు.