బైక్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

● ఇద్దరికి తీవ్రగాయాలు ● చికిత్స పొందుతూ మృతి

ఇంద్రవెల్లి: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ఆడే ప్రకాశ్‌ (56), రాథోడ్‌ రాంజీ (65) కలిసి బైక్‌పై గురువారం ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని తమ బంధువుల ఇంట్లో టీలా వేడుక కోసం వెళ్తున్నారు. ఇంద్రవెల్లి మండలం నర్సపూర్‌ చౌక్‌ సమీపంలో ప్రధాన రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆడే ప్రకాశ్‌, రాథోడ్‌ రాంజీలను స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రిమ్స్‌కు వెళ్లి పంచనామ అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement