పాతమంచిర్యాల: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ సభ్యులు గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. అత్యధికంగా రక్తదాతలను సమకూర్చిన విభాగంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు సభ్యుడు, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్‌రావు మొదటి అవార్డు అందుకున్నారు. సంస్థల విభాగంలో 246 మంది రక్తదాతలను సమకూర్చిన జైపూర్ పవర్ ప్లాంట్ డీజీఎం డి.పంతులు పురస్కారం అందుకున్నారు. 91 రక్తదాన శిబిరాల్లో 6,016 యూనిట్ల రక్తం సేకరించిన మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో నిలి చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ తమ తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు రక్తదానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి అవా ర్డును పొందడంతో తనపై మరింత భాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, స్టేట్ ఎంసీ సభ్యులు వి.మధుసూదన్‌రెడ్డి, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రెటరీ కాసర్ల రంజిత్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్, ఎడ్ల కిషన్, సురభి శరత్‌రావు, చుంచు శంకర్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.


