పిచ్చికుక్కదాడిలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కదాడిలో ఇద్దరికి గాయాలు

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

నెన్నెల: మండల కేంద్రంలో ఆదివారం పి చ్చికుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. కోమటివాడకు చెందిన నేతరి విమల ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా పి చ్చికుక్క ఆమె కాలును కరిచింది. అక్కడి నుంచి హనుమాన్‌ మందిర వద్ద రోడ్డుపై వెళ్తున్న లింగంపల్లి శంకర్‌పై దాడి చేసి గాయపర్చడంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన ఇద్దరిని పీహెచ్‌సీలో చికిత్స అందించి ఇంటికి పంపించారు. గ్రామంలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కల బెడద లేకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement