నిర్మల్‌ఖిల్లా: దుబాయ్‌లో క్యాబ్‌డ్రైవర్, బైక్ రైడర్‌గా పనిచేసేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు టామ్‌కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. 21 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టుతోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలని తెలిపారు. బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడటం, చదవడం తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నెలకు సుమారు రూ.64 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టామ్‌కామ్ అధికారిక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 చివరి తేదీ, ఎంపికై నవారికి స్క్రీనింగ్ అనంతరం వైద్యపరీక్షలు, సీజీ/స్క్రీనింగ్ క్లియరెన్స్, వీసా ఆమోదానికి లోబడి తుది ఎంపిక ఉంటుందని వివరించారు. వివరాలకు 9440049520 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


