సింగరేణి ఆవిర్భావ వేడుకలపై అశ్రద్ధ బాధాకరం
పాతమంచిర్యాల: సింగరేణి ఆవిర్భావ వేడుకలపై అశ్రద్ధ వహించడం బాధాకరమని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య అన్నారు. మంచిర్యాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేడుకలకు యాజమాన్యం నిధులు కేటాయించకపోవడం, జీఎం కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించడాన్ని తప్పు పట్టారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీపై ఉన్న శ్రద్ధ సింగరేణి సంస్థపై లేకపోవడం బాధాకరమని, అధికారుల అనాలోచిత నిర్ణయాలు కార్మికుల మనోభావాలు దెబ్బ తీశాయని అన్నారు. ఈసారి కూడా వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరా రు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, గంగయ్య, రాజేశం, పర్వతాలు పాల్గొన్నారు.


