17శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని వినతి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 17శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో జరిగే ఎన్నికలన్నింటిని ప్రభుత్వ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేస్తారని, ఉద్యోగులకు రావాల్సిన వాటిని ప్రభుత్వం పరంగా వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్ల య్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, నరేందర్, ఆర్గనైజ్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, ప్రచార కార్యదర్శి యూసుఫ్, సంయుక్త కార్యదర్శి సునిత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు.


