చట్ట ప్రకారం చర్యలు
పెరిగిన టెక్నాలజీ ఏఐతో ఫేక్ వీడియోలు, ఫొటోలు తయా రు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సున్నితమైన కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఏఐతో తప్పుడు కంటెంట్ తయారు చేసిన వారితోపాటు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వారందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మూడేళ్ల వరకు శిక్ష పడవచ్చు. నిజనిర్ధారణ చేసుకోకుండా ఎవరూ షేర్ చేయవద్దు.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల


