వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారి అనిత
దండేపల్లి/జన్నారం: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రతీ పోలింగ్ కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. సోమవారం ఆమె దండేపల్లి మండలం దండేపల్లి, తాళ్లపేట, జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున ఉదయం ఆరు గంటలకే వైద్య సిబ్బంది ఆరోగ్య కేంద్రాల్లో రిపోర్టు చేసి మందులతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు. ఈ సమావేశాల్లో డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, జిల్లా మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్యులు ఉమాశ్రీ, సతీష్, క్రాంతికుమార్ పాల్గొన్నారు.


