‘కార్మిక చట్టాలను స్వాగతిస్తున్నాం’
మందమర్రిరూరల్: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను బీఎంఎస్ స్వాగతిస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సంస్థ ప్రగతి, దేశాభివృద్ధికి 49 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా సవరణ చేసి ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనిని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాలు అవగాహన లేక సింగరేణి విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అలాంటి దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం నమ్మవద్దని కోరారు. నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు చట్టాల వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికర్గానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో బీఎంఎస్ సెంట్రల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు, ఏరియా ఉపాధ్యక్షుడు రమేష్, ప్రదీప్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.


