ఎన్‌కౌంటర్ చేయాలి..!
మహిళలపై అత్యాచారం, హత్య చేసిన వారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయ్యాలి. అప్పుడే బాలిక ఆత్మ శాంతిస్తుంది. ఇలాంటి వాళ్లు భూమి మీద బతికి ఉన్నా రానున్న రోజుల్లో మరిన్ని సంఘటనలకు దారి తీస్తుంది. కోర్టు, బెయిల్, విచారణ పేరుతో కాలయాపన చేయడం, వారికి భద్రత, జైల్లో తిండి ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు. నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత యథేచ్ఛగా తిరుగుతుంటారు. మరిన్ని ఘటనలు చేసే అవకాశం ఉంటుంది. – కే.లావణ్య, పీవోడబ్ల్యూ
రాష్ట్ర కో కన్వీనర్, మంచిర్యాల
అశ్లీల సైట్లను నిరోధించాలి
చట్టాలు కఠినంగా అమలు చేయడంతోపాటు అశ్లీల వె బ్‌సైట్లను పూర్తిగా నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మద్యపానం మానవులను మృగాళ్లుగా మారుస్తుంది. మద్యపానం నిషేధించాలి. బాలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఆపద ఉందని భావిస్తే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయాలి. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కరాటే, కుంగ్‌ఫూ, క్రీడల్లో ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – కుర్మ సునిత, వనిత
వాక్కు ఫౌండేషన్ కో ఫౌండర్, మంచిర్యాల
ఎన్‌కౌంటర్ చేయాలి..!


