సోషల్ మీడియాలో ఓటింగ్
కౌటాల: పంచాయ తీ ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో పోరు వా డీవేడిగా సాగుతోంది. నామినేషన్ల స్వీ కరణ ముగియడంతో అభ్యర్థులు ప్ర చార పర్వం షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారోనని యువత ముందుగానే సాంకేతికతను వినియోగిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో ఓ యాప్‌ను వినియోగిస్తూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వస్తే వాటిని ఆయా సోషల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేస్తూ తమ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం చేస్తున్నారు.
సర్పంచ్ బరిలో తోడి కోడళ్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. గ్రామానికి చెందిన తోడికోడళ్లు కొత్తపల్లి కళ, కొత్తపల్లి చంద్రకళ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి ఇద్దరూ బరిలోనే ఉన్నారు.
సోషల్ మీడియాలో ఓటింగ్
సోషల్ మీడియాలో ఓటింగ్


