‘ఆదివాసీల సమస్యల పరిష్కారంలో విఫలం’
ఇచ్చోడ: ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ ఆరో పించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇచ్చిన హామీ ఒక్క టి కూడా నెరవేర్చలేదన్నారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో స్పష్టత ఇవ్వాలని, జీవో 3 పునరుద్ధరించా లని, ఆదివాసీ గూడేల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు నైతం శేఖర్, నాయికపోడ్ నాయకుడు రమేశ్, తుడుందెబ్బ నాయకుడు మురళీకృష్ణ, ప్రధాన్ సంఘం నాయకుడు గెడం మధుకర్, తోటి సంఘ నాయకుడు కాత్లే విఠల్, తదితరులు పాల్గొన్నారు.


