భీమారం అడవుల్లో బెబ్బులి
భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం రిజర్వు ఫారెస్ట్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్‌రావు తెలిపారు. మంగళవారం రాత్రి నెన్నెల మండలం గంగారం మీ దుగా భీమారం–నెన్నెల ప్రధాన రహదారి దా టి దాంపూర్ అటవీప్రాంతంలోకి అడుగుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దాంపూర్ రిజర్వు ఫారెస్ట్‌లోకి వచ్చిన పులి కుందారం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు రిజర్వు ఫారెస్ట్‌లో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంచిర్యాల అటవీ డివిజన్ అధికారులు, సిబ్బంది అటవీప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.


