జాతీయస్థాయికి ఎంపిక
చెన్నూర్‌రూరల్: మండలంలోని ఆస్నాద జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని గుడిమల్ల శ్రీవర్షి ని అండర్–17 జాతీయ స్థాయి వాలీబాల్ పో టీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం అనురాధ తెలి పారు. గత నెల 17నుంచి 25వరకు మహబూ బ్‌నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై న ట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. శుక్రవారం వ ర్షినిని పాఠశాలలో హెచ్‌ఎం, పీడీ సత్యనారా యణ, ఉపాధ్యాయులు అభినందించారు.


