కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో వైద్యశిబిరం
కోటపల్లి: మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జ్వ రాలతో బాధపడుతుండగా ‘ఆశ్ర మ పాఠశాల విద్యార్థులకు జ్వ రం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించి న వార్తకు వైద్యాధికారులు స్పందించారు. గి రిజన ఆశ్రమ పాఠశాలలో వైద్యాధికారి అరుణశ్రీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. 33మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వ్యక్తిగ త పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన క ల్పించారు. డాక్టర్ నిహారిక, సబ్‌యూనిట్ అ ధికారి శ్రీనివాస్, ఎన్‌సీడీ కో ఆర్డినేటర్ లక్ష్మణ స్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ మధునయ్య, పీహెచ్‌ఎన్ అంజలామేరి, సూపర్‌వైజర్ ఇందిరాగాంధీ, విజయనిర్మల, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఏఎన్‌ఎం తిరుపతమ్మ ఉన్నారు.
ఎఫెక్ట్
కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో వైద్యశిబిరం


