లెక్చరర్ తిరుపతికి డాక్టరేట్
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ అధ్యాపకుడు మె రుపుటాల తిరుపతి శుక్రవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. దండేపల్లి మండలం వెల్గ నూర్ గ్రామానికి చెందిన తిరుపతి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ‘స్వయం సహా యక బృందాల ద్వారా మహిళా సాధికారిత’ అంశంపై ఎకనామిక్స్ ప్రొఫెసర్ వరప్రసాద్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. వారి జీవన స్థితిగతులు, ఆరోగ్యం, విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాముఖ్యత, బ్యాంక్ రుణాలు, వాటి విలువలను వివరిస్తూ తగిన సూచనలు, సలహాలు అందించారు. దీంతో అతడికి డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ వీసీ ఉ మేశ్‌కుమార్, ప్రొఫెసర్ వరప్రసాద్ తిరుపతి ని అభినందించగా, ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.


