మహిళలంతా అక్షర జ్ఞానం కలిగి ఉండాలి
కాసిపేట: ప్రతీ మహిళ అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గు ర్తింపు ఉంటుందని జిల్లా వయోజన విద్యాధికారి పు రుషోత్తం నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని రైతువేదికలో జిల్లా వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ము ఖ్య అతిథిగా హాజరై వయోజన విద్య ప్రాముఖ్యత, అందరికి విద్య ప్రాధాన్యం, వయోజన విద్యతో కలి గే ప్రయోజనాలు, నిరాక్షరాస్యతతో కలిగే సమస్యలు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా ‘అమ్మ కు అక్షరమాల’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ స్వర్ణలత, జి ల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, డీఆర్పీ జనార్దన్, శాంకరి, ఏపీఎం రాజ్‌కుమార్, సెర్ప్ సిబ్బంది, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.


