పేరుకే నగరం!
పరేషాన్‌లో మంచిర్యాల జనం భర్తీకి నోచుకోని కీలక పోస్టులు ఉన్నవారికే అదనపు బాధ్యతలు పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం వివిధ అభివృద్ధి పనుల్లో జాప్యం ప్రజలకు సరైన సేవలందని వైనం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో నగవాసులకు సరైన సేవలు అందడం లేదు. మంచిర్యాల మున్సిపాలిటీతోపాటు నస్పూరు బల్ది యా, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ ఈ ఏడాది జనవరిలో మంచి ర్యాలను మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశా రు. మంచిర్యాల నగర పాలక సంస్థగా కాగితాల్లోనే మారగా, ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎంత మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉండాలనే క్యా డర్ స్ట్రెంత్ ఇవ్వలేదు. దీంతో పాత మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోనే నెట్టుకొస్తుండగా నగరవాసులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టుల ఖాళీలు ఇలా..
జిల్లాలోనే గ్రేడ్–1 మున్సిపాలిటీ, జిల్లా కేంద్రంగా ఉన్న మంచిర్యాలను మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చినా సరిపడా ఉద్యోగులు, సిబ్బందిని భర్తీ చేయకపోవడంతో నగర అభివృద్ధిపై ప్రభావం ప డుతోంది. నిధులకు కొరత లేకపోయినా అభివృద్ధి పనులు చేపట్టడం ఇబ్బందిగా మారుతోంది. ఇళ్ల ని ర్మాణాలు ఎక్కువగా చేపడుతున్నా పరిశీలించాల్సి న రెండు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. దీంతో భవన నిర్మాణాల్లో అవకతవకలు జ రుగుతున్నాయి. నిర్మాణ సమయంలో పలువురు ని బంధనలు ఉల్లంఘిస్తున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా తది తర ముఖ్యమైన విధులు నిర్వహించాల్సిన డివిజ నల్ ఇంజినీర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈ రిటైర్డ్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఏఈ రాజేందర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆదాయాన్ని సమకూర్చే కీలక విభాగంలోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలు గురు హెల్త్ అసిస్టెంట్లకు ఇద్దరే పనిచేస్తున్నారు. ఇందులో ఒకరికి చెన్నూరు మున్సిపాలిటీకి డిప్యుటేషన్ ఇవ్వడంతో, ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లకు ఇద్దరు పని చేస్తున్నారు. కార్పొరేషన్‌లో 60 డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో వార్డు ఆఫీసర్ ఉండాల్సింది కాగా, ప్రస్తుతం 54 మంది మాత్రమే ఉన్నారు.
అభివృద్ధి పనులకు ఆటంకం
నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు జరుగుతున్నా వీటిని పర్యవేక్షించే అధికారులే లేరు. టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ రెండు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా పలువురు ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది కమర్షియ ల్ భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని అడ్డుకునేవారే లేరు. దీంతో నగరపాలక సంస్థ ఆదాయం కోల్పోతోంది. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజలకు అ వసరమైన రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, పార్కుల ఏర్పాటు, వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ప్రతిరోజూ చేపట్టాల్సిన పనులు కాగా, కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో అనుకున్న సమయంలో పూర్తి చేయలేని పరిస్థితి తలెత్తుతోంది.
అర్హత లేని వారిని ఇన్‌చార్జీలుగా..
నగరపాలక సంస్థ శానిటరీ విభాగంలో ఇన్‌చార్జీలుగా అర్హత లేని వారికి విధులు కేటా యించారు. కార్పొరేషన్‌కు శానిటరీ సూపర్‌వైజర్‌తో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. నగర పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం కష్టంగా ఉండడంతో నస్పూరులో పనిచేసిన ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ ప్రశాంత్‌కు నస్పూర్ శాని టరీ విభాగాన్ని, నస్పూరులోనే బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న శివరామకృష్ణకు హాజీపూర్ మండలంలోని ఎనిమిది విలీన గ్రామాల పారిశు ధ్య నిర్వహణ పనుల బాధ్యత అప్పగించారు. పని విభజన కోసం అర్హత లేకున్నా విధులు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. పన్నుల వసూళ్లలో కీలకమైన రెగ్యులర్ ఆర్‌ఐని శానిటరీ విభాగానికి కేటాయించి, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గడ్డం శంకర్‌కు ఆర్‌ఐగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపైనా విమర్శలు వస్తున్నాయి.
క్యాడర్ స్ట్రెంత్ వస్తేనే..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత అవసరమైన అధికారులు, సిబ్బందికి సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్‌ను ఇప్పటికీ ప్రకటించలేదు. ఖాళీ పోస్టులపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. సరిపడా సిబ్బంది లేక ఉన్నవారికే ఇన్‌చార్జీలుగా బాధ్యతలిచ్చాం. అవసరమైన సిబ్బంది ఉంటే అభివృద్ధికి ఆటంకమేర్పడదు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోనే సేవలందిస్తున్నాం.
– సంపత్‌కుమార్, కమిషనర్
మంచిర్యాల నగర ముఖచిత్రం


