డీటీవోగా గోపీకృష్ణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): డీటీవోగా వెల్ది గోపీకృష్ణను నియమిస్తూ రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం గోపీకృష్ణ ఇన్‌చార్జి డీటీవో సంతో ష్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ఉద్యోగం సాధించిన గోపీకృష్ణ ఇప్పటివరకు ఏఎంవీఐగా ఖమ్మం ఆర్టీవో కా ర్యాలయంలో పని చేశారు. ఏఎంవీ ఐగా వి ధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్షలు రాసి ఆర్టీవో ఉద్యోగం సాధించారు. గోపీకృష్ణకు ఇ టీవల మంచిర్యాలకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కాగా, ఈ నెలలోనే నిశ్చి తార్థం జరగనుంది. గోపీకృష్ణకు ఎంవీఐలు సంతోష్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంవీఐ లు ఖాసీం, సూర్యతేజ, సాయిలెనిన్, సిబ్బంది స్వాగతం పలికారు. ఇక్కడ 22 నెలలుగా ఇన్‌చార్జి డీటీవోగా పని చేస్తున్న సంతోష్‌కుమార్ ఎంవీఐగా ఇక్కడే కొనసాగనున్నారు. అనంతరం గోపీకృష్ణ జిల్లా రవాణాశాఖకు సీసీసీలో సింగరేణి కేటాయించిన కార్యాలయాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.


