 
															ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థత
బజార్‌హత్నూర్: మండలంలోని కొలారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఐరన్ మాత్రలు మింగి అస్వస్థతకు గురయ్యారు. ఇన్‌చార్జి ఎంఈవో రాంకిషన్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఆశ కార్యకర్త సురేఖ ఐరన్ (ఫొలిక్ యాసిడ్) మాత్రలు ఇచ్చారు. అవి వేసుకున్న ఏడుగురు విద్యార్థులు టార్పే సాక్షిత, టార్పే ఇందుజ, ఆరాధ్య, అమృత, సుజా త, ఓంకార్, కార్తీక్ వాంతులు చేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిలివేరి శ్రీలక్ష్మి వెంటనే మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
