 
															గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: మండలంలోని గూడెం వద్ద గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన గోళ్ల రవీందర్ (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఉదయం అతని భార్య సుమలత అత్త దేవక్కతో కలిసి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం సమీప బంధువైన శ్రీనివాస్ సుమలతకు ఫోన్‌చేసి మీ భర్త బైక్ గూడెం బ్రిడ్జి వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లింది. భర్త కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికించగా మృతదేహం లభించింది. మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
