 
															వేతనాలు తక్కువ వేశారని ఫిర్యాదు
మందమర్రిరూరల్: తమకు అక్టోబర్ మాసం వేతనాల్లో తక్కువ వేశారని మండలంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో రాజేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య మాట్లాడుతూ పని ప్రోగ్రెస్‌లో ఎలాంటి పొరపాటు లేనప్పటికీ ఏపీవో మండలంలోని ప్రతీ ఫీల్డ్ అసిస్టెంట్‌కు 250, సారంగపల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.1,397, శంకర్‌పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.1,011 వేతనంలో తగ్గించి వేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని డీపీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లి తగ్గించి వేసిన వేతనాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శెట్టి సత్యనారాయణ, నెండుగూరి బాపు, బోరె జ్యోతి, సెగ్యం శంకరయ్య, తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
