 
															ఆర్జీయుకేటీలో ఆంగ్లభాషపై అవగాహన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఈ నెల 30, 31 తేదీల్లో విద్యార్థులకు ఆంగ్లభాషపై అవగాహన కల్పిస్తున్నట్లు వీసీ గోవర్ధన్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఆంగ్లభాష నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కెన్నడి బాబు హాజరై ఆంగ్లభాషపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆంగ్ల విభా గం అధిపతి ఎ.విజయ్ కుమార్, డాక్టర్ ఎస్ విఠల్, డాక్టర్ గుజ్జారి శంకర్, డాక్టర్ ఎన్.విజయ్‌కుమార్, యు.ప్రభాకర్, డి.వసంత్‌బాబు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
