 
															బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
నిర్మల్‌రూరల్: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని న్యూవెల్మల్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ (35) జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరాడు. అక్కాపూర్ గ్రామం వద్ద రోడ్డుపై ఓ రైతు ఆరబోసిన సోయాకుప్పలోంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
