 
															ఇద్దరిపై రౌడీషీట్
నిర్మల్‌టౌన్: పట్టణానికి చెందిన ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. సోన్ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఉమర్, గఫర్ తమ స్నేహితులతో కలిసి నిర్మల్‌కు వచ్చారు. హోటల్‌లో భోజనం చేసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో గఫర్ తన స్నేహితులతో కలిసి తిరుమల లాడ్జి ఎదుట నిలబడి ఉండగా బాలాజీవాడకు చెందిన ప్రమోద్, బుధవార్‌పేట్‌కు చెందిన దేవర రాజ్ కుమార్ వారిని బూతులు తిడుతూ గఫర్‌ను బండతో కొట్టి గాయపరిచారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గత నేరచరిత్ర ఉండడంతో వారిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
