 
															ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
నార్నూర్: మండలంలోని నాగల్‌కొండ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరల్డ్ బ్యాంకు బృందం సభ్యులు సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రిజిస్టర్‌లను పరి శీలించారు. రోగులకు వైద్యం అందిస్తున్న తీరును స్థానిక ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందుతున్న తీరును గ్రామ పెద్దలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న మందులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనితీరు బా గుందన్నారు. వరల్డ్ బ్యాంకు బృందం ప్రతినిధులు డాక్టర్ కృష్ణ, రంజన్ బివర్మ, అనికేత్ ఘన్‌శ్యామ్, రాష్ట్ర క్వాలిటీ మేనేజర్ రాధిక, స్టేట్ డీడీఎం జా న్సన్, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, జిల్లా ప్రో గ్రాం అధికారి జాదవ్ దేవిదాస్, ప్రభుత్వ ఆసుపత్రి డీడీవో డాక్టర్ రాంబాబు తదితరులు ఉన్నారు.
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు ఎస్.కృష్ణ, రంజన్, బి. వర్మ, అనికేత్ ఘన్‌శ్యామ్ అన్నారు. బుధవారం ఉ ట్నూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వ సతులు, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర క్వాలిటీ ఆఫీసర్ రాధిక, డీఎంవో డా క్టర్ శ్రీధర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దేవీదాస్ జా దవ్, ఏవో గీతేష్, డీడీఎం రమణ, నోడల్ ఆఫీసర్ డా.కపిల్ నాయక్, ఆసుపత్రి ఆర్‌ఎంవో డా.మ హేందర్ సిబ్బంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
