 
															‘వైద్యుల నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి’
మందమర్రిరూరల్: కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యుల నిర్లక్ష్యం, సింగరేణి పీఆర్వోల బాధ్యతారాహిత్యం వల్లనే మందమర్రి ఏరియాలోని వర్క్‌షాపులో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే తాళ్ల రమేశ్ మృతి చెందాడని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం రామన్‌కాలనీలో రమేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న రమేశ్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా రూ.9 లక్షలు పేమెంట్ చేస్తేనే ట్రీట్‌మెంట్ చేస్తామని కాలయాపన చేశారని ఆరోపించారు. కొత్తగూడెం సీఎంవో నుంచి పేమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత పేషెంట్ మంగళవారం మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారన్నారు. కార్మికుడి మృతికి సింగరేణి భవన్‌లో ఉన్న హెల్ప్‌లైన్ డాక్టర్లు, పీఆర్వోలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రమేశ్ మృతదేహాన్ని టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ తదితర సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
