 
															చికిత్స పొందుతూ వ్యక్తి..
గుడిహత్నూర్: మండలంలోని మా న్కాపూర్ గ్రామానికి చెందిన నల్వాడ్ విట్టల్ (39) మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్ర కారం.. వ్యవసాయం చేసే నల్వాడ్ విట్టల్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి తన అన్న కొడుకు మనోజ్‌కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. మనోజ్‌తో సహా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి కదల లేని స్థితిలో ఉన్న విట్టల్‌ను రిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం విట్టల్ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పలు రైళ్లు రద్దు
కాగజ్‌నగర్‌టౌన్: మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను బుధ, గురు రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజిపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
