 
															శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్
ఇచ్చోడ: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారని తెలిపా రు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవిండ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 బైకులు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఎస్సైలు పురుషోత్తం, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజతో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
