 
															బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలి
మందమర్రిరూరల్: ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు నాయకులు సహకరించాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. నాయకులు ఏరియాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఐఈడీ కిరణ్‌కుమార్, సీవిల్ ఎస్‌ఈ రాము, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు దాగం మల్లేష్, అక్బర్ అలీ, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
