 
															ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బుధవారం రాత్రి వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 87వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 50వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 288 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 23 గేట్లు ఎత్తి 1.59లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వదులుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
