 
															విద్యార్థులకు నాణ్యమైన విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలేక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పరిపాలన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థ, ఉపయోగానికి పనికిరాని పాత గదులను తొలగించి నూతన భవనాల నిర్మాణలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీలకు ప్రతిపాదనలు పంపించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలిపారు.
కేజీబీవీ సందర్శన
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ సంతోష్‌తో కలిసి తరగతి గదులు, వంటశాల, రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
