 
															రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీ య రహదారులు, రోడ్లు భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమి షనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్ర త కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7వరకు అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్–కరీంనగర్–చంద్రాపూర్ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, బాసర–లక్సెట్టిపేట రహదారి(రాష్ట్రీయ రహదారి–24)పై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నందున భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు సెల్లార్ స్థలాలు పార్కింగ్ కోసమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, నాలాలపై అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని, సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27నుంచి నవంబర్ 2వరకు విజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలిపా రు.
అవార్డుల జారీ వేగవంతం చేయాలి
మంచిర్యాలటౌన్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
