 
															జాతీయ రహదారిపై ‘బెల్ట్’ జోరు
కోటపల్లి: మండలంలోని జాతీయ రహదారి–63పై బెల్ట్ దుకాణాల్లో మద్యం దందా జోరుగా సాగుతోంది. దాబాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవిస్తూ అతివేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసు ల దర్యాప్తులో వెల్లడవుతోంది. కోటపల్లి మండలం లక్ష్మిపూర్, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకు ని ఉన్న అంతర్రాష్ట్ర వంతెనకు కొద్ది దూరంలోనే మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర సరిహద్దు గ్రా మాల్లోని మందుబాబులు లక్ష్మిపూర్ గ్రామ సమీ పంలోని దాబాల్లో మద్యం కొనుగోలు చేస్తుంటా రు. దాబాల్లో ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.50నుంచి రూ.100 వరకు వసూలు చేస్తుంటారు. జాతీయ రహదారికి ఇరువైపులా మహా రాష్ట్ర, తెలంగాణ స రిహద్దు ప్రాంతాలైన లక్ష్మిపూర్, రాపన్‌పల్లి 63వ జా తీయ రహదారిపై దాబాల్లో ఎకై ్సజ్, పోలీసులు తని ఖీ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ తనిఖీకి వెళ్లాల్సి వస్తే ముందుగానే నిర్వాహకులకు సమాచారం చేరుతుందనే ఆరోపణలున్నాయి. దాబాల్లో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ చెన్నూర్ సీఐ హరిని సంప్రదించగా.. దాబాల్లో మద్యం అమ్మకాలు నిషేధమని, విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
