 
															పింఛన్‌లో రూ.16 కోతపై ఆందోళన
వేమనపల్లి: ఆసరా పింఛన్ల లబ్ధిదారుల నుంచి రూ.16 కోత విధించడంపై మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వృద్ధులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పోస్టుమాస్టర్ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ నగదు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016 అందజేయాలి. కానీ ప్రతీ నెల రూ.16 మినహాయించుకుని మిగతా మొత్తం ఇస్తున్నారు. దీంతో వృద్ధులు ఆందోళనకు దిగారు. మండలంలో వృద్ధులు 1,225 మంది, వితంతువులు 875, దివ్యాంగులు 266 మంది పింఛన్ పొందుతున్నారు. పింఛన్‌లో డబ్బు కోతపై పోస్టుమాస్టర్ శాంతను సంప్రదించగా.. కొందరు రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) చెల్లిస్తున్నారని, వడ్డీ కట్టడం లేదని తెలిపారు. చిల్లర రూ.16 వడ్డీ కింద తీసుకుంటున్నామని, ఈ వ్యవహారం మండలం అంతటా ఇలానే ఉందని సమాధానం ఇచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
