 
															నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జావిద్ నిజాయితీ చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరిచిపోయిన బ్యా గును పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. ఉట్నూర్ ఎక్స్ రోడ్డుకు చెందిన సునీత సొంతూరు మహారాష్ట్రకు వెళ్లింది. తిరిగి మంగళవారం ట్రైన్‌లో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించింది. బస్టాండ్‌లో దిగిన ఆమె ఐదు గ్రాముల బంగారు కమ్మలు, 10 తులాల వెండి ఆభరణాలు కలిగిన బ్యాగు మరిచిపోయింది. వెంటనే అప్రమత్తమై బస్టాండ్ వద్ద గల ఆదిలాబా ద్ పోలీస్ సబ్ కంట్రోల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఏఆర్ ఎస్సై దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ అప్రమత్తమయ్యారు. ఇంతలో ఆటోడ్రైవర్ జావిద్ నిజాయితీగా అక్కడకు చేరుకుని ఆ బ్యాగును పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ బ్యాగును వారు బాధితురాలికి అప్పగించారు. త్వరగా స్పందించి బాధితురాలికి న్యాయం చేసేలా కృషి చేసిన సిబ్బందిని, నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను డీఎస్పీ జీవన్‌రెడ్డి అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
