 
															ఏఐ సంస్థతో ఆర్జీయూకేటీకి అవగాహన ఒప్పందం
బాసర: బాసర ఆర్జీయూకేటీకి మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాల అవగాహన ఒప్పందం కుదిరిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన కళాశాలలో మాట్లాడారు. విద్యార్థుల్లో వృత్తిపరమై న నైపుణ్యాలు, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్ ద్వారా శక్తిమంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఆర్జీయూకేటీ బాసర హైదరాబాద్‌కు చెందిన మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాలంలో పరస్పర అవగాహన ఒప్పందం కుదరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఏఐ విద్య, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వనరులను ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దిల్ బహార్, డా.మహేశ్, శేఖర్, డా.విఠల్, డా.సాగర్, డా.కాశన్న, డా.భావ్సింగ్, సుజయ్ సర్కార్, ఉపేందర్, వెంకటరామ్, మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నిపుణులు సిలివేరు శ్రీనివాస్, భాను కిరణ్, భానుప్రసాద్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
