 
															నాగారంలో గుడుంబా నిషేధం
వేమనపల్లి: గుడుంబా విక్రయాలు జరపకూడదని మండలంలోని నాగారం గ్రామస్తులు తీర్మానించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని బు య్యారం, దహెగాం, కన్నెపల్లి మండలాల నుంచి కొందరు గుడుంబా ప్యాకెట్లు తెచ్చి గ్రామంలో విక్రయిస్తున్నారు. గుడుంబా తాగినవారు కుటుంబాల్లో గొడవ పడుతున్నారు. పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరు ఉల్లంఘించినా పట్టుకుని పోలీస్, ఆబ్కారీశాఖ అధికారులకు అప్పగించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
