 
															వ్యాన్‌ను ఢీకొట్టిన మట్టి లారీ
తాండూర్: సుబాబుల్‌లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌ను మంగళవారం తెల్లవారుజామున తాండూర్ మండలం వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద నిలిపి ఉంచగా వెనుక నుంచి ఓ మట్టి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో క్లీనర్ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై రెండు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయమేర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. సర్వీస్ రోడ్లపై వాహనాలు నిలుపవద్దని ఆదేశాలున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
