ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు

Oct 29 2025 7:25 AM | Updated on Oct 29 2025 7:25 AM

ఆర్టీ

ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు

● పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ● అరుణాచలం, అయోధ్యకు కూడా.. ● ఆదాయం పెంచుకునేందుకు చర్యలు ● ‘కార్తీక’ంలో భక్తులకు సౌకర్యవంతం ● నవంబర్‌ 8న ఉదయం 11గంటలకు ఆదిలాబా ద్‌ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నారు. కాణిపాకం, వెల్లూరు, అరుణాచలం, జోగులాంబ పుణ్యక్షేత్రాల మీదుగా బస్సు వెళ్లనుంది. నాలుగురోజుల ఈ యాత్రకు ఒక్కొక్కరికి రూ.5,200 చార్జీ వసూలు చేస్తారు. ఈ బస్సు తిరిగి నవంబర్‌ 11న రాత్రి 10గంటలకు ఆదిలాబాద్‌కు చేరుతుంది. ● నవంబర్‌ 2న ఆదిలాబాద్‌ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సు నడుపనున్నారు. రాత్రి 11గంట లకు బస్సు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11గంటలకు చేరుకుంటుంది. పెద్దవారికి రూ. 900, పిల్లలకు రూ.500 చార్జి తీసుకోనున్నారు. ● నవంబర్‌ 3న ఆదిలాబాద్‌ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సు నడిపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉదయం 5గంటలకు బయలుదేరనున్న బస్సు రాత్రి 10గంటలకు తిరిగి చేరుకోనుంది. ఒక్కొక్కరికి రూ.310 చార్జీ తీసుకోనన్నారు. ● మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ వేములవాడ, కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నవంబర్‌ 1న శ్రీశైలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నారు. పెద్దలకు రూ.5,700, చిన్నవారికి రూ.2,850 చార్జీ వసూలు చేయనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభించారు. ● నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కాశీ, అయోధ్యకు సూపర్‌ లగ్జరీ బస్సు ప్రా రంభించారు. ఒక్కొక్కరికి చార్జీగా రూ.6,400 నిర్ణయించారు. నవంబర్‌ 6న మరోసారి అయో ధ్య, కాశీ క్షేత్రాలకు బస్సు నడపనున్నారు. ప్ర యాణికుల డిమాండ్‌కు తగినట్లు మరిన్ని బస్సులు వేసేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అరుణాచల పుణ్యక్షేత్రానికి నవంబర్‌ 7న ప్రత్యేక బస్సు నడుపనున్నారు. తిరుపతి మీదుగా కాణిపాకం, వేలూరు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని అరుణాచలానికి చేరుకుంటుంది. ఒక్కొక్కరికి రూ.6,300 చార్జీ వసూలు చేస్తారు. నవంబర్‌ 7న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానున్న ఈ బస్సు 11న తిరిగి నిర్మల్‌కు చేరుకోనుంది. ● భైంసా నుంచి వేములవాడకు ఈ నెల 31న, నవంబర్‌ 3న ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఒక్కొక్కరికి రూ.600 చార్జీ వసూలు చేయనున్నారు. ఈ బస్సు ఉదయం 5 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి చేరుకోనుంది.

ఆదిలాబాద్‌: ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కార్తీకమాసాన్ని పరమపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. హరిహరాదులకు ప్రీతిపాత్రంగా భావించే ఈ మాసంలో కార్తీక స్నానాలు చేయడంతోపాటు శైవక్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు.

పుణ్యక్షేత్రాలు ఇవే..

కార్తీకమాసం నేపథ్యంలో ఆదిలాబాద్‌ డిపో నుంచి ఆర్టీసీ అధికారులు అరుణాచలం, కాళేశ్వరం క్షేత్రాల కు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి అరుణాచలం, అయోధ్య, మంచి ర్యాల నుంచి అరుణాచలం, శ్రీశైలం, భైంసా నుంచి వేములవాడ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు వేశా రు. ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లు తిరుపతి, రామేశ్వరం, శబరిమలై పుణ్యక్షేత్రాలకూ బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ బస్టాండ్‌ నుంచి..

మంచిర్యాల బస్టాండ్‌ నుంచి..

నిర్మల్‌, భైంసా బస్టాండ్‌ల నుంచి..

వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు

డిపో పేరు సెల్‌ నంబర్‌

ఆదిలాబాద్‌, ఉట్నూరు 9959226002

నిర్మల్‌ 9959226003

భైంసా 9959226005

ఆసిఫాబాద్‌ 9959226006

మంచిర్యాల 9959226004

సద్వినియోగం చేసుకోవాలి

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్రాలకు సమీపంగా ఉండే పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అరుణాచలం, అయోధ్య, కాశీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇప్పటికే తొమ్మిది ప్రత్యేక సర్వీసులు బుక్‌ అయ్యాయి. ప్రయాణికుల స్పందనకు అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.

– ఎస్‌.భవానీ ప్రసాద్‌,

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌

ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు1
1/1

ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement