 
															విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి వేళాయె..
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మ హాపోచమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేవాదాయశాఖ న వంబర్ 7న ముహూర్తం ఖరారు చేసింది. అమ్మవా రి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నేటి నుంచి 11 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మండలంలో ని ఆయా గ్రామాల్లోని దాదాపు 100మంది భక్తులు అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు ఆలయ ప్రధాన అ ర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని వసతిగదుల్లో సన్నిధానం ఏ ర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మాలధారణకు ముందుకు వచ్చిన భక్తులకు శతాధిక ప్రతిష్ఠాపనా చార్యులు గురుమంచి చంద్రశేఖరశర్మ మాలవేసి ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మండలంలోని వీడీసీలు ముందుకువచ్చాయి. ఇతర సేవాకార్యక్రమాలు చేపట్టేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తులు ఆసక్తి చూపుతున్నా రు. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను అట్ట హాసంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశా రు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజల అభీ ష్టం మేరకే విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ ఈవో భూమయ్య తెలిపారు. భ క్తులు విరాళాలిచ్చేందుకు ముందుకువస్తున్నట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
 
							విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి వేళాయె..
 
							విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి వేళాయె..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
