 
															లాభాల ఆశ చూపి మోసగించారని ఫిర్యాదు
ఖానాపూర్: ఓ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి తమ వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేశారని ఖానాపూర్, కడెం, పెంబి మండలాలకు చెందిన 12మంది రైతులు మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము పెట్టుబడి పెట్టి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. బాధ్యులపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దొనికెని భీమయ్య, మోటపలుకుల రాజమౌళి, ఎండీ ఖాజా, కూరపాటి రాజేశ్వర్‌రెడ్డి, గుడిసె నర్స య్య, ఏలేటి నర్సింహారెడ్డి, ముత్యాల రాజేశ్వర్‌రెడ్డి, మేకల రాజిరెడ్డి, భూషణ్‌రెడ్డి, పుప్పాల రవి, బండారి రవీందర్, గుమ్ముల లింగన్న ఉన్నారు.
 
							లాభాల ఆశ చూపి మోసగించారని ఫిర్యాదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
