 
															ఆటో బోల్తా: పలువురికి గాయాలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి వాగు వంతెన వద్ద ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం నాగారం గ్రామం నుంచి బద్దంపల్లికి వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో బోగారపు బాపు అనే ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నాయిని గట్టయ్య, మరో ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా, వీరిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని ఏఎస్సై నరేశ్, పోలీసులు పరిశీలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
దిలావర్‌పూర్: మండల కేంద్రానికి సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై మంగళవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కుంటాల మండల కేంద్రానికి చెందిన జుట్టు సుభాష్ తన కారులో నిర్మల్ వైపు నుంచి తన స్వగ్రామమైన కుంటాల వైపునకు వెళ్తున్నాడు. ఇతడి కారును గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గమనించిన సమీప టోల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ సుభాష్‌ను కారులోంచి దించి అంబులెన్స్‌లో చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. ప్రస్తుతం సుభాష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మామడ: మండలంలోని బూరుగుపల్లి జాతీయరహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన లాకేశ్వర్ నాయ క్ (25) దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ ట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
 
							ఆటో బోల్తా: పలువురికి గాయాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
