 
															● ఎంపీడీవో వేధింపులతోనేనని ఆరోపణలు ● విచారణకు ఆయా సంఘాల
టెక్నికల్ అసిస్టెంట్ మృతి
బెల్లంపల్లిరూరల్: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ దుగుట భాస్కర్ (31) మంగళవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. ఎంపీడీవో మహేందర్ 15రో జులుగా విధి నిర్వహణలో భాస్కర్‌పై ఒత్తిడి పెంచి మనోవేదనకు గురిచేస్తున్నట్లు తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎంపీడీవో ముడుపులు ఇవ్వాలని ఒత్తిడి తేవడం, ఈక్రమంలో వారంక్రితం భార్గవ్‌కు మెమో జారీ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందడంతోపాటు అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు వారు చెబుతున్నారు. ఈజీఎస్ ఈసీ అనిల్ ఎంపీడీవోపై ఇవే ఆరోపిస్తూ చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భార్గ వ్ మృతికి కారణమైన ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు కోరుతున్నారు.
ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి
భార్గవ్ మృతికి ఎంపీడీవోనే కారణమని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని నేతకాని మహార్ సేవా సంఘం, దళిత సంఘాల నాయకులు గుమాస శ్రీకాంత్, ముడిమడుగుల మహేందర్, దాగం మల్లేశ్, రామటెంకి వాసుదేవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆరోపణల్లో వాస్తవం లేదు
– మహేందర్, ఎంపీడీవో
భార్గవ్ మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీడీవో మహేందర్ వివరించారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో 145 సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల ఏర్పాటు చేయకుండానే రూ.5.80 లక్షలు డ్రా చేయడంపై సిబ్బంది నిలదీశానని తెలిపారు. దీని పై ఉన్నతాధికారులకు నివేదించానని సూచించారు. అయితే.. గిట్టని వారే తనపై కక్ష సాధింపుతో తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భార్గవ్ మృతిపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే తాను సహకరిస్తానని తెలిపారు. కొంతకాలంగా అనారో గ్యంతో బాధ పడుతున్న భార్గవ్ ఆరోగ్యం క్షీణించిన కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
