 
															ఉరేసుకుని రైతు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని మొహళ గ్రామానికి చెందిన రైతు దండే గంగన్న (53) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గంగన్నకు ఇద్దరు కూతుళ్లున్నారు. రూ.3లక్షలు అప్పు చేసి పెద్ద కూతురు వివాహం చేశాడు. ఖరీఫ్‌లో తాను సాగు చేసిన పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి వద్ద ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతుడి భార్య బోజాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చోరీ నిందితుడి అరెస్ట్
ముధోల్: ఆగస్టు 12న మండల కేంద్రంలోని ఝటాశంకర్ ఆలయంలో చోరీకి పాల్పడ్డ బాసర గ్రామానికి చెందిన ఓర్సా లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐబీ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్ష్మణ్ పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నట్లు తెలిపారు. అతడి నుంచి రూ.1,500 నగదు, ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుకున్న ద్విచక్రవాహనం సోమవారం బోధన్ పట్టణంలోని ఓ మెకానిక్ షాపు నుంచి దొంగిలించినట్లు తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
పాము కాటుతో మహిళ మృతి
కెరమెరి: మండలంలోని సావర్‌ఖెడా గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (32) పాముకాటుతో మరణించింది. ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్య సోమవారం చేనులో పత్తి సేకరిస్తుండగా గుర్తు తెలియని పాము కా టువేసింది. గమనించిన పలువురు రైతులు ఆమె భర్త తులసీరాంకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చా రు. వెంటనే అక్కడికి చేరుకున్న తులసీరాం సంధ్యను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తులసీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధూకర్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
