 
															పెట్టుబడుల పేరిట మోసగించిన ఒకరి అరెస్ట్
కాగజ్‌నగర్ టౌన్: స్టాక్స్, ఐపీవో ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరిట వాట్సాప్ గ్రూప్‌లు సృష్టించి మోసగించిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వహీదుద్దీన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్ వర్మాస్‌బుక్ డిస్కషన్, అలయన్స్ పేరిట వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేశాడు. 108 మందిని చేర్చి వారితో ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో డబ్బులు కాజేశాడు. బాధితులు 26 దఫాలుగా రూ.76.50లక్షలు ఇన్వెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఓ ఫిర్యాదుదారు జూలై 5న ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ పట్టణ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరిట వచ్చే ఆఫర్లను నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. అపరిచతులు క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఉండకూడదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలంటే అధికారిక, ధ్రువీకృత ప్లాట్‌ఫాంలనే ఉపయోగించాలని తెలిపారు. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైం, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పట్టణ సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
