ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం
పాతమంచిర్యాల: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షు డు దుంపల రంజిత్‌కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో యూనియన్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ ఎఫ్‌టీఏను చెల్లించాలని అ న్నారు. రెండో ఏఎన్‌ఎం పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంలు మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా దుంపల రంజిత్‌కుమార్, అధ్యక్షురాలుగా సంధ్య, కార్యదర్శిగా మౌ లాలి, కోశాధికారిగా గంగ, ఉపాధ్యక్షులుగా శోభ, రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిగా విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులుగా సత్యవతి ఎన్నికయ్యారు.


